Homeఆంధ్ర ప్రదేశ్రూ.32 ల‌క్ష‌లు సొంతానికి వాడుకున్న వైనం

రూ.32 ల‌క్ష‌లు సొంతానికి వాడుకున్న వైనం

  • ఆర్‌పి చ‌ల్లా కోటేశ్వ‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలి
  • అధికారుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోవ‌డం లేదు
  • న్యాయం చేయ‌లంటూ ఆందోళ‌న‌

పల్నాడు, క్రైం మిర్ర‌ర్ః డ్వాక్ర మ‌హిళ‌లు పొదుపు చేసిన సొమ్మును స‌భ్యుల‌కు తెలియ‌కుండానే డ్రా చేసిన సంఘ‌ట‌న ప‌ల్నాడులో చోటు చేసుకుంది.

న‌ర్స‌రావుపేట‌కు చెందిన ఆర్‌పీ చ‌ల్లా కోటేశ్వ‌రి త‌మకు తెలియ‌కుండా త‌మ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.32ల క్ష‌లు డ్రా చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అధికారుల‌కు విన్న‌వించిన ప‌ట్టించుకోవ‌డం లేదు….

తమ బ్యాంకుఖాతాలో ఉన్న రూ.32 ల‌క్ష‌ల‌ను త‌మ‌కుతెలియ‌కుండా ఆర్‌పీ డ్రా చేసింద‌ని అధికారుల‌కు, పోలీసుల‌కు ఎన్ని సార్లు విన్న‌వించిన ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

120 మంది డ్వాక్ర మహిళలు క‌ట్టిన డ‌బ్బును కోటేశ్వ‌రి సొంతానికి వాడుకుంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఈవిష‌యం ఎన్నిసార్లు బ్యాంకు అధికారుల‌కు చెప్పిన ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు.

న‌ర్స‌రావుపేట స్టేడియం ఎదుట ఆందోళ‌న‌…

త‌మ‌కు తెలియ‌కుండా డ్రా చేసిన రూ.32 ల‌క్ష‌లు ఇప్పించి న్యాయం చేయాల‌ని కోరుతూ న‌ర్స‌రావుపేట స్టేడియం ఎదుట సంఘం స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు.

ఇప్పుడు బ్యాంకుఅధికారులు డబ్బులు పంపించాల‌ని నోటీసులు పంపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయం చేయాల‌ని కోరుతూ రోడ్డుపై బైటాయించి నిర‌స‌న తెలిపారు.

పై అధికారులు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకొని న్యాయం చేయాల‌ని కోరారు.

మ‌హిళలు బైటాయింపుతో స‌త్త‌న‌ప‌ల్లి నుంచి న‌ర్స‌రావుపేట‌కు వాహ‌న‌రాక‌పోక‌లు కొద్ది సేపు నిలిచిపోయాయి

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు