HomeజాతీయంHigh Court: శారీరక సంబంధానికి అంగీకరిస్తే.. వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదు!

High Court: శారీరక సంబంధానికి అంగీకరిస్తే.. వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదు!

Delhi High Court On Consent Relationship: ఓ మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తే వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి వేధించడానికి అనుమతి తెలిపినట్లు ఎంతమాత్రం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళను లైంగికంగా వేధించి, బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడి బెయిల్‌ విచారణ సందర్భంగా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతోనే తమ మధ్య సంబంధం కొనసాగిందని నిందితుడు చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది.

అంగీకారం ఉన్నా అలా చేయడం తప్పు!

అంగీకారం ఉన్నా లైంగిక దాడులు చేస్తే చట్టప్రకారం తప్పుకాకుండా పోదని స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి గతంలో అంగీకరించినంత మాత్రాన భవిష్యత్‌లో భాగస్వామి చేసే పనులన్నింటికీ లైసెన్సు ఇచ్చినట్లు కాదంది. వీడియోల ద్వారా బలవంతం చేస్తే అది ఏకాభిప్రాయం కిందకురాదని ప్రకటించింది. నిందితుడు తనను లైంగికంగా వేధించి, తమ ఏకాంత వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టాడంటూ ఢిల్లీకి చెందిన ఓ వివాహిత ఫిర్యాదు చేయగా, 2024లో కేసు నమోదైంది. దానిపై తాజాగా న్యాయస్థానం విచారణ జరిపింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు