Homeఆంధ్ర ప్రదేశ్పెద్ద పులి క‌ల‌క‌లం

పెద్ద పులి క‌ల‌క‌లం

  • కొబ్బ‌రితోట‌లోకి వెళ్లిన‌ట్లు గుర్తింపు

    సీసీ కెమెరాలో రికార్డ‌యిన పెద్ద‌పులి క‌ద‌లిక‌లు

    భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

 

రాజమండ్రి, క్రైం మిర్ర‌ర్ః

ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ స‌మీపంలో పెద్ద‌పులి సంచారంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ మ‌ధ్య ఉన్న కొబ్బ‌రి తోట‌లోకి పెద్ద‌పులివెళ్లిన‌ట్లు సీసీ కెమెరాలో రికార్డు కావ‌డంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

ఇంత‌కు ముందు ఏలురు జిల్లాను వ‌ణికించిన పెద్ద‌పులి ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన‌ట్లు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1న రాజమండ్రి రూరల్ పరిధిలోని తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపిన ఘటన కూడా కలకలం రేపింది.

కాగా పులి సంచారంతో ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు కంటిమీద కునుకులేకుండా వణికిపోతున్నారు. బ‌య‌టకు వెళ్లి ప‌నులు చేసుకోలేనిప‌రిస్థ‌తి నెల‌కొంది.

అధికారుల అప్ర‌మ‌త్తం…
పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది.

రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బి.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో డీఎఫ్‌వో ప్రభాకరరావు, ఎఫ్‌ఆర్‌వో దావీదురాజు నాయుడు, డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాసరావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారిని రాజమహేంద్రవరం రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు