Sunday, March 22, 2026
Homeతెలంగాణతెలంగాణ సామజిక న్యాయ దినోత్సవం

తెలంగాణ సామజిక న్యాయ దినోత్సవం

  • అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌మ‌న్యాయం
  • సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,క్రైం మిర్ర‌ర్‌

“తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని బుధ‌వారం తెలంగాణ‌ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజలకు సమన్యాయం, సామాజిక సాధికారత కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద‌పీట వేసింద‌ని తెలిపారు. అంతేగాకుండ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’ ను ఎంతో నిబద్ధతతో శాస్త్రీయ పద్ధతిలో పూర్తి చేసిందని గుర్తుచేశారు.

ఎస్సీ ఉప కులాల‌కు ప‌రిస్కారం చూపిన ఏకైక రాష్టం తెలంగాణ‌…

అంతే కాకుండా, దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు పరిష్కారం చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

అన్ని వర్గాలకు సమాన, సముచిత న్యాయం కల్పించాలనే ఆశయంతో తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో, ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కోసం ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments