Homeక్రైమ్Emotional: ప్రియుడి మృతి.. తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Emotional: ప్రియుడి మృతి.. తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Emotional: సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతిచెందిన తర్వాత తీవ్రమైన మనస్తాపానికి గురైన 18 ఏళ్ల శ్రావణి అనే యువతి తన ప్రాణాలు తానే తీసుకోవడం గ్రామాన్ని కలిచివేసింది. ఇంటర్‌ పూర్తిచేసుకున్న ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు కూలిపనులకు వెళ్లే సాధారణ జీవితాన్ని గడుపుతుండేది. ఇదే సమయంలో దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాతో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

అయితే ఇటీవల మహేష్ అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో శ్రావణి తీవ్రమైన మానసిక వేదనతో ఇబ్బందిపడింది. రోజురోజుకీ ఆమెలో బాధ పెరుగుతుండటాన్ని కుటుంబ సభ్యులు గమనించినా.. పరిస్థితి ఇలా మారుతుందని ఊహించలేదు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో తీవ్ర మనోవేదనతో శ్రావణి చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా రెండు ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రేమ కథ విషాదాన్నే మిగిల్చింది. శ్రావణి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ALSO READ: Sarpanch Elections: అన్నాచెల్లెళ్ల మధ్యే పోటీ!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు