Saturday, February 28, 2026
Homeతెలంగాణపాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడిన కాంగ్రెస్ నేతలు

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడిన కాంగ్రెస్ నేతలు

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండుగా చిలీపోయింది. ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి, అత్త ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తిరగబడుతున్నారు. అత్తాకోడళ్ల తీరుతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశం రచ్చరచ్చగా మారింది. ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి, ఝాన్సీరెడ్డిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో అత్తా కోడళ్ళ ఆధిపత్యం మితీమీరిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నాహక సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేయించారు అత్తాకోడళ్లు. దేవరుప్పుల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూరి రమేష్‌ను అడ్డుకొని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అలాగే దేవరుప్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు.
తమ పార్టీ మీటింగ్‌కు తమను రాకుండా అడ్డుకోవడం ఏంటని పోలీసులపై తిరగబడ్డారు పెద్ది కృష్ణమూర్తి అనుచరులు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments