Monday, March 16, 2026
Homeఆంధ్ర ప్రదేశ్15 నిమిషాలు రోడ్ షో... గంట పాటు సభ.

15 నిమిషాలు రోడ్ షో… గంట పాటు సభ.

క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. కాగా హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ కి చేరతారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్ షో లో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉంటుంది. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ను సందర్శిస్తారు. తదుపరి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత 5.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
5.20కి గన్నవరం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళతారు.

ప్రధాన వేదికపై 20 మంది !

ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తారు. దానిపై 100 మంది ఉంటారు.

ఏపీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా !

రెండు రాష్ట్రాల్లో.. ఈ 13 ప్రదేశాల ప్రజలు జాగ్రత్త!.. ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments