Thursday, March 12, 2026
Homeఅంతర్జాతీయందావోస్ లో జోరుగా సెక్స్ పార్టీలు.. ఆ ఐదు రోజులే అదే పని..

దావోస్ లో జోరుగా సెక్స్ పార్టీలు.. ఆ ఐదు రోజులే అదే పని..

స్విట్డర్లాండ్ లోని దావోస్ లో ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. జనవరి 20 నుంచి 24 వరకు జరిగిన సదస్సులో భారీగా పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరిగాయి. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రైజింగ్ బృందం దావోస్ వెళ్లింది. ఐదు రోజుల్లో పలు సంస్థలతో చర్చలు జరిపి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చింది. దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలో లక్షా 83 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తాజాగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సంబంధించి సంచలన విషయం వెలుగులోనికి వచ్చింది. దావోస్ సదస్సుల్లో పెట్టుబడుల ఎంవోయూలతో పాటు జోరుగా సెక్స్ పార్టీలు జరిగాయని తేలింది. ఈ నెల 20 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు నాయకులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు మొదలైనవారు హాజరయ్యారు. అయితే ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం జరిగినట్లు బ్రిటీష్ మీడియా డైలీ మెయిల్ ఓ సంచలన కథనం రాసింది.

ఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది.. దావోస్‌లో ఆ ఐదు రోజులు అమ్మాయిల బుక్కింగ్స్‌లో రికార్డ్స్ అని వెల్లడించింది. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లో సుమారు 6,000 పౌండ్లు (రు.6.5 లక్షలు) సంపాదించారని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments