Homeఆంధ్ర ప్రదేశ్పులివెందుల డీఎస్పీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించిన జగన్

పులివెందుల డీఎస్పీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించిన జగన్

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘రెండు లేదంటే నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బెదిరించారు. జగన్ బంధువు వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల అనంతరం తిరిగి వెళ్తూ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్ అక్కడ ఈ హెచ్చరిక చేశారు.

Read More : మహా కుంభమేళా ప్రారంభం.. ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది జనం

విచారణలో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీని జగన్ తన వద్దకు పిలిచారు. ఆయన ఇద్దరు సీఐలతో కలిసి జగన్ వద్దకు వెళ్లారు. మురళీ నాయక్‌ను చూడగానే జగన్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం రెండు లేదంటే నాలుగు నెలల్లో మారిపోవచ్చని, అప్పుడు మీ పని ఉంటుందని హెచ్చరించారు.

Read More : భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డిని విచారిస్తున్నది డీఎస్పీ మురళీ నాయకే. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ హెచ్చరించినట్టు తెలిసింది. అందరి ముందు జగన్ ఆయనను బెదిరించడం చర్చనీయాంశమైంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments