తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ వరుస చిక్కుల్లో పడుతోంది. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బంధువులపై కేసు నమోదైంది. హరీష్ రావు సమీప బంధువులపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
తమ ఐదంతస్థుల ప్రాపర్టీలోకి హరీష్‌రావు బంధువులు అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. మియాపూర్ పీఎస్‌లో దండు లచ్చిరాజు కంప్లైంట్ ఇచ్చారు. తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు పై కేసు నమోదైంది.
ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్‌పాస్ తీసుకుని బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీనోటు తీసుకుని హరీష్‌రావు బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారని దండి లచ్చిరాజు ఆరోపించారు. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని ఫిర్యాదు చేశారు. జంపన ప్రభావతి మీద లచ్చిరాజు ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లచ్చిరాజు ఆరోపించారు. ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నారు లచ్చిరాజు. దీంతో మియాపూర్ పోలీసులు హరీష్ రావు బంధువులపై కేసు నమోదు చేశారు.