
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఏసిబి అధికారులకు అడ్డగా దొరికిండు. ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం ఆరువేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కోరాడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందినా రైతు వ్యవసాయ భూమికి నాలా కన్వర్షన్ చెయ్యాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే లంచం ఇవ్వాల్సిందేనని నాయబ్ తహసిల్దార్ మల్లేశం డిమాండ్ చేసాడు.
Read More : చెరువులో దూకి ఎస్ఐ, కానిస్టేబుల్ సూసైడ్.. కామారెడ్డి జిల్లాలో కలకలం
దీంతో భాదిత రైతు అవినీతి నిరోధక శాఖా అధికారులను ఆశ్రయించాడు. పతాకం ప్రకారం శనివారం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్టు అనంతరం వాంగ్మూలం రికార్డ్ చేసి కేసునమోద్ చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.