తెలంగాణనల్గొండ

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌ను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బాలు నాయక్‌ని అడ్డుకున్నారు గ్రామస్తులు.తమ గ్రామంలో రావద్దు అంటూ నిరసన తెలియజేశారు. గ్రామస్తుల ఆందోళనతో కారు దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే బాలు నాయక్.

దేవరకొండ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బాలు నాయక్. 2009లో గెలిచిన బాలు నాయక్.. మళ్లీ 2023లో గెలిచారు. అయితే రెండోసారి గెలిచాక ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లినా వినడం లేదంటున్నారు. ఇక గ్రామంలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. వాళ్లంతా ఆగ్రహంతో బాలు నాయక్ ను అడ్డుకున్నారని తెలుస్తోంది.

Back to top button