క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: జనవరి 28 నుండి జనవరి 31, 2026 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అయిన “వింగ్స్ ఇండియా 2026″ ఈవెంట్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి “కె. రామ్మోహన్ నాయుడు“ నేడు బుధవారం (జనవరి 28) ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు.
భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేయడం అనే ఇతివృత్తంతో, రాబోయే పదేళ్లలో భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో 31కి పైగా విమానాల ప్రదర్శన, సూర్యకిరణ్ మరియు మార్క్ జెఫరీస్ ఏరోబాటిక్ బృందాల సాహసోపేత విన్యాసాలు కనుల విందు చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుండి ప్రతినిధులు, ఎయిర్‌బస్ మరియు బోయింగ్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యం. మొదటి రెండు రోజులు (జనవరి 28, 29) వ్యాపార నిమిత్తం కేటాయించబడగా, చివరి రెండు రోజులు (జనవరి 30, 31) సాధారణ ప్రజల సందర్శనకు అనుమతి ఉంటుంది. ఆసక్తి గల వారు Wings India అధికారిక వెబ్‌సైట్ లేదా BookMyShow ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.





