
క్రైమర్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ ల విషయంలో తమ రికార్డును కొనసాగిస్తూ ఉన్నారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 645 సిక్సర్లను నమోదు చేశారు. దీంతో ఈ రికార్డును చేరుకోవడానికి మిగతా ప్లేయర్లకు అసాధ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లో హిట్ మాన్ 645 సిక్సర్లు బాధగా.. ఇక మిగతా యాక్టివ్ ప్లేయర్లలో రెండవ స్థానంలో బట్లర్ 387 సిక్సర్లతో ఉన్నారు. అంటే రోహిత్ కు, బట్లర్ కు మధ్య 250 కి పైగానే సిక్సర్ల తేడా ఉంది. ఇక ఆ తరువాత మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ 313 సిక్సర్లతో ఉన్నారు. ఇక 310 సిక్సులతో మాక్సివల్ నాలుగవ స్థానంలో ఉండగా 291 సిక్సర్లతో స్టెర్లింగ్ 5వ స్థానంలో ఉన్నారు. దీంతో అత్యధిక సిక్సర్లు కొట్టి మొదటి స్థానంలో ఉంటూనే రికార్డు సృష్టించినటువంటి రోహిత్ శర్మాను దాటి రికార్డు సృష్టించే దమ్ము ఎవరికీ లేదని చెప్పాలి. ఒకవేళ ఉన్నా కూడా ఈ టాప్ 5 స్థానాల్లో ఉన్నవారే బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును అందుకోవడం మిగతా క్రికెటర్లకు ఇప్పటిలో అసాధ్యం అనే చెప్పాలి. ఒకవేళ భవిష్యత్తులో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును ఎవరు బ్రేక్ చేయగలరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : Good News: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ..!
Read also : Good News: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ..!





