
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. వీళ్ళిద్దరూ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెప్పుకొస్తున్నారని ఆరోపించారు. గత మా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి, తీసుకువచ్చినటువంటి కొత్త సంస్కరణలను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినే “క్రెడిట్ చోరీ” అంటారు అని ఎద్దేవా చేశారు. మరోవైపు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్, కొన్ని కొత్త పోర్టు లు లాంటివి ఎన్నో మేం ప్రారంభించినవే అని చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు పాలనలో కొంచెం కూడా భూసేకరణ జరగలేదు అని.. సెజ్ చేసినటువంటి భూములను కూడా వైసీపీ ప్రభుత్వమే తిరిగి ఇచ్చింది అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు… జగన్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ఇలా ఎన్నో జగన్ చేసినటువంటివి… చంద్రబాబు చాలా తొందరగా తన ఖాతాలో వేసుకున్నారు అని… ఆగ్రహించారు. తన జీవితకాలంలో ప్రజలందరూ ఆహా అని గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా పడుకున్న రోజులు చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే లేదు అని చెప్పుకోచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లానే ఇప్పుడు తన తనయుడు నారా లోకేష్ అబద్దాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉన్నారని అన్నారు. చంద్రబాబు కన్న నాలుగింతలు ఎక్కువ చదివిన నారా లోకేష్ తండ్రిని మించి రాజకీయంలో అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
Read also : భారీ వర్షాల వేల స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
Read also : వరల్డ్ కప్ ఓపెనర్స్ పై సోషల్ మీడియాలో చర్చ..!