
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా?.. అని, ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి ముందుకు వెళ్తారా లేదా అనే విషయాలు ప్రజలతో పాటు కొంతమంది కార్యకర్తలకు కూడా సందేహం నెలకొంది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక స్పష్టత అనేది ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నవంబర్ మూడవ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన తరువాతే స్థానిక సంస్థలు ఎన్నికలపై ఒక నిర్ణయం అనేది తీసుకుంటామని మంత్రి పొంగులేటి తాజాగా స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత నవంబర్ 7వ తేదీన మరోసారి క్యాబినెట్ బేటి నిర్వహిస్తామని ఉన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీకి గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఎలక్షన్లలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బంద్ నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరే తెలిసింది. ఈ బంద్ లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Read also : ఆసియా కప్ హీరో సంచలన వ్యాఖ్యలు..!
Read also : భారీ వర్షాలపై దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం!





