క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- కొద్ది రోజుల నుంచి భారత దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది అని… దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సిలిండర్ల పట్ల ఆందోళన చెందుతున్న వార్తలు వైరల్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని స్పష్టం చేశారు. సిలిండర్ బుకింగ్ విషయంలోనూ ఎటువంటి మార్పులు జరగకుండా సిలిండర్ బుకింగ్ ఆన్లైన్ లోనే ఉండే విధంగా ఏజెన్సీలకు ఆదేశాలను జారీ చేశామన్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా OTP విధానంలోనే గ్యాస్ సిలిండర్ అందజేస్తాము అని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగకుండా చూసుకుంటూనే వాటితో పాటుగా హోటల్స్ లలో అధిక ధరలు వసూలు చేసే వారిపై కూడా తక్షణమే చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంపై జాగ్రత్త వహించి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరారు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
సాయంత్రం ట్రైలర్ రిలీజ్.. ఒకే రోజు అభిమానులకు రెండు పండుగలు
