క్రీడలు

చాలా చీప్ గా టెస్ట్ టికెట్స్… అది కూడా భారత్ VS సౌత్ఆఫ్రికా మ్యాచ్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- నవంబర్ 14 నుంచి భారత్ మరియు సౌత్ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఒక ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే… భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తో జరిగే మొదటి టెస్ట్ కు చాలా చీప్ గా టికెట్స్ దొరకనున్నాయి. ఒక్కో టికెట్ ప్రారంభ ధర కేవలం 60 రూపాయకు మాత్రమే నిర్ణయించారు. ఈ టికెట్స్ ఇవాళ మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్రికెట్ అంటే మన భారతదేశంలో ఒక ఎమోషన్ లా భావిస్తారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. మూడు, నాలుగు గంటలలో మ్యాచ్ అయిపోయే టి20 లకు ఫ్యాన్స్ ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసి మైదానాలకు వస్తున్నారు. కానీ టెస్ట్ క్రికెట్ అంటేనే ఎక్కువ గంటలపాటు కూర్చొని వీక్షించేటువంటి గేమ్. కాబట్టి టి20 ల ప్రభావము ఏమో కానీ టెస్టులకు ఆదరణ మాత్రం పూర్తిగా తగ్గిపోతున్నట్లు తెలుస్తుంది.

Read also : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన డీజీపీ

ఇటీవల వెస్టిండీస్ సిరీస్ లో ప్రేక్షకుల స్పందన చూస్తే ఇవే ఆలోచనలు గుర్తుకు వస్తున్నాయి. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్కత్తా వేదికగా జరగబోయేటువంటి టెస్ట్ మ్యాచ్ కు చాలా తక్కువ ధరలకే టికెట్ ధరలు అందుబాటులోకి ఉంచారు. రోజుకు కేవలం 60 రూపాయలుగా మాత్రమే టికెట్ ధరలు నిర్ణయించారు. కాబట్టి ఐదు రోజులకు కలిపి 400 రూపాయలు కూడా ఖర్చు కావు. గంటల కొద్ది క్రికెట్ మైదానంలో కూర్చోవాలి అంటే కచ్చితంగా ప్రేక్షకులకు కూడా ఇబ్బందికరమనే చెప్పాలి. బహుశా అందుకే నేమో ప్లేయర్స్ కూడా టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మొబైల్స్ లేదా టీవీలలో మాత్రమే ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లను వీక్షిస్తున్నారు. టి20 అలాగే వన్డే మ్యాచ్లకు అయితే నేరుగా ఎంత టికెట్ పెట్టి అయినా సరే మైదానాలకు వెళ్తున్నారు. దీంతో టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని… ప్రజలను టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ కు ముగ్గు చూపేలా కొత్తగా ఏవైనా ప్రయత్నాలు చేయాలని బీసీసీఐకి కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : రేవంత్ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ లేదు : హరీష్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button