త్వరగా జాతీయ జట్టులోకి వైభవ్ ను తీసుకోవాలి : కాంగ్రెస్ నేత

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఈ మధ్యకాలంలో 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. అతి తక్కువ వయసులోనే విధ్వంసాన్ని సృష్టిస్తూ తాజాగా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో కూడా టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అతని పేరు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది. అతనే వైభవ్ సూర్య వంశీ. తన అద్భుతమైన ఆట తీరుతూ ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ విషయంపైనే తాజాగా కాంగ్రెస్ కీలక నేత శశితరూర్ వైభవ్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ లాగానే వైభవ్ ను కూడా త్వరగా టీమ్ ఇండియా జాతీయ జట్టులోకి తీసుకోవాలి అని తన అభిప్రాయాన్ని తెలిపారు. అతను మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడు అని ట్రీట్ చేశారు. గతంలో 14 సంవత్సరాల కుర్రాడు అని అనగానే ప్రతి ఒక్కరికి కూడా సచిన్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు. తన అద్భుతమైన ఆటతీరుతో తక్కువ వయసులోనే టీమ్ ఇండియా జట్టులోకి రాగలిగాడు అని తెలిపారు. ఇప్పటిలో జాతీయ జట్టులోకి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. కానీ వైభవ్ సూర్య వంశీకి అంతా సమయం వృధా చేయకండి అని… త్వరగా వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోవాలి అని తెలిపారు. సీనియర్లతో వైభవ్ సూర్యవంశీ కలిసి ఆడాలి అని.. అప్పుడే భవిష్యత్తులో మరింత మంచి ఆటగాడిగా తయారవుతాడు అని తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Read also : రాబోయే సంక్రాంతికి బరిలో స్టార్ హీరోల సినిమాలు

Read also : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button