
క్రైమ్ మిర్రర్, సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో కారులో చక్కర్లు కొడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన ఓ గ్యాంగ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ గ్యాంగ్‌పై అనుమానం రావడంతో స్థానికులు వారిని నిలువరించి కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారు డిక్కీలో మారణాయుధాలు బయటపడటంతో స్థానికులు అవాక్కయ్యారు. వారిని సుపారీ గ్యాంగ్‌గా అనుమానిస్తున్న పోలీసులు, అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
ఇటీవలే పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేసే వ్యక్తిని హత్య చేస్తామంటూ ఈ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసేందుకే గ్యాంగ్ కారు తిరుగుతున్నట్లు సమాచారం.
సంఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పట్టణంలో అప్రమత్తత కొనసాగుతుండగా, ఈ గ్యాంగ్ వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.