Tuesday, February 24, 2026
Homeక్రైమ్కలుషిత నీరు తాగి దసరా పండగ రోజే ఇద్దరు మృతి

కలుషిత నీరు తాగి దసరా పండగ రోజే ఇద్దరు మృతి

తెలంగాణలో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మిషన్ భగీరథ సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలకు బోరు నీళ్లే దిక్కయ్యాయి. అయితే బోరుబావిలోని కలుషిత నీరు తాగి దసరా పండగ పూటే ఇద్దరు చనిపోయారు, మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లాలో పండగ పూట ఈ విషాదం చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం సంజీవరావు పేట గ్రామంలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఊర్లో ఉన్న బావి నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. బావి నుంచి బీసీ కాలనీకి పంచాయతీ సిబ్బంది నీటిని సప్లై చేశారు. అయితే అంతకుముందే ఆ బావిలో ప్రమాదవశాత్తు కుక్క పడి చనిపోయింది. దానిని పంచాయతీ సిబ్బంది గమనించలేదు. ఆ నీటిని తాగడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో దాదాపుగా 50 మందికి పైగా నారాయణఖేడ్ ఆస్పత్రిలో చేరారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గొల్ల మహేశ్, సాయవ్వ చనిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కున్నారు. గ్రామంలో వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.రామస్తులు అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతానికి ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments