క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల తతంగం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత, అంటే జనవరి నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ లేదా పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తుది ఓటర్ల జాబితా జనవరి 10, 2026న ప్రచురించబడింది.
వార్డుల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా తుది జాబితాలు జనవరి 12 మరియు జనవరి 16 తేదీలలో ప్రచురించబడతాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నాయి.





