
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు రెండవ వన్డే మ్యాచ్ జరుగునుంది. ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్లో ఓడిన భారత్ రెండవ వన్డేలో గెలవాలన్న కసితో మైదానంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. నేడు అడలైడ్ వేదికగా టీమిండియా ఇవాళ ఆస్ట్రేలియాతో తడపడునుంది. ఈ పిచ్ లో భారత్కు మంచి రికార్డులు ఉండడంతో భారత్ కు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
Read also : భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు?
మూడు వన్డే సిరీస్ లో టీమ్ ఇండియా నిలవాలి అంటే కచ్చితంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. ఒక వైపు రోహిత్ శర్మ మరోవైపు విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాల్సిన టైం వచ్చింది. తొలి వన్డే మ్యాచ్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా మంచి జోరు మీద ఉంది. మరోవైపు భారత్ కు నేడు కీలకమైన మ్యాచ్ కాబట్టి… తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. వన్డే మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని పొందిన భారత్… ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు అడిలైడ్ ఓవల్ మైదానం మన భారత్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ మైదానంలో 15 మ్యాచ్లాడిన భారత జట్టు 9 మ్యాచ్లలో విజయం సాధించింది. ఈరోజు ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా… ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లైవ్ లో చూడవచ్చు. ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా రోహిత్ మరియు విరాట్ కోహ్లీ రాణిస్తే చూడాలని ఆశగా ఉన్నారు. మరి ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఇది మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శనం – అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పణ