
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు 4వ టీ20 మ్యాచ్ జరుగునుంది. వీరిద్దరి మధ్య 5t20 ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ లు ముగిసాయి. ఇందులో మొదటి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా తర్వాత రెండు టీ20 మ్యాచ్లలో చెరొకటి గెలిచి ఇరుజట్లు కూడా సమానంగా ఉన్నాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం ఓవల్ వేదికగా 1:45 గంటలకు 4వ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు కూడా గెలిచి సిరీస్ లో ముందంజ వెయ్యాలని భావిస్తున్నారు. రెండవ టి20 లో ఆస్ట్రేలియా గెలిచి తన సత్తా ఏంటో చూపించగా మూడవ టి20లో భారత్ గెలిచి తన సత్తా ఏంటో వాళ్ళు చూయించారు. ఇక రెండు టి20 లు మాత్రమే మిగిలి ఉండగా ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారో వారే ఈ టి20 సిరీస్ కైవసం చేసుకోనున్నారు. మరి రెండు మ్యాచ్లలో విజయాన్ని నమోదు చేసి ఆస్ట్రేలియా టి20 సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తుండగా.. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు టి20 సిరీస్ నైనా గెలవాలని పట్టుదలతో కాచుకొని ఉంది. భారత జట్టు తరుపున స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బ్యాటింగ్ పరంగాను గిల్, సూర్య కుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ భారీ స్కోరులను నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కంటే భారత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ నిపుణులు అంచనా వేశారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి
Read also : మేము ఎవరికి అనుచరులం కాదు.. అది రెడ్డి అయినా?.. రావు అయినా? : అక్బరుద్దిన్
Read also : మేము ఎవరికి అనుచరులం కాదు.. అది రెడ్డి అయినా?.. రావు అయినా? : అక్బరుద్దిన్





