తెలంగాణ

ఆవేశంలో మాట్లాడిన మాటలు అవి.. సీఎం కు క్షమాపణలు చెప్పిన సురేఖ

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ కుమార్తె ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఈలోపే ఏమైందో తెలీదు కానీ.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. కేవలం మిస్ అండర్స్టాండింగ్ తోనే కొన్ని గొడవలు జరిగాయని అన్నారు. పార్టీ కూడా ఒక కుటుంబం లాంటిదే.. కుటుంబంలో సహజంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. రాజకీయంలో కూడా అంతే… పార్టీ అన్నాక కొన్ని మిస్ అండర్స్టాండింగ్ ఉంటాయి… అవి ఇప్పుడు సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆరోజు రాత్రి మా ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు రావడంతోనే నా కూతురు ఆవేశంలో అలా ఆగ్రహంతో మాట్లాడిందని చెప్పుకొచ్చారు. నా కుమార్తె మాట్లాడిన వ్యాఖ్యలకు నేను క్షమాపణలు చెబుతున్న అంటూ అన్నారు. రేవంత్ రెడ్డి గారికి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం అనేది ఇక్కడితో తెరపడినట్లు అయ్యింది.

Read also : కోర్టు తీర్పు వెల్లడించిన తరువాతే ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం : మంత్రి పొంగులేటి

కాగా కొద్ది రోజుల క్రితం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా కలిసి మాపై కుట్ర చేస్తున్నారంటూ మంత్రి కొండ సురేఖ కూతురు సుస్మిత ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావాలనే తమపై కొంతమంది కక్ష కట్టారని… పోలీసులు మా ఇంటి చుట్టూ చుట్టుముట్టారని… అయినా కూడా ఎవరు ఏమి చేయలేరు అంటూ కొండ సురేఖ కుమార్తె పౌరుషంతో కొన్ని మాటలు మాట్లాడారు. ఈ విషయం కొద్ది రోజుల క్రిందట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని కూడా వాడుకున్నారు. అయితే తాజాగా ఆవేశంలో మాట్లాడిన మాటలు అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నాను అని చెప్పి మంత్రి కొండా సురేఖ మ్యాటర్ ను ఇంతటితో ముగించారు.

Read also : భారీ వర్షాలపై దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button