
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం మండలం రావిర్యాలలో స్వయంభువై వెలిసిన శ్రీ సూర్య గిరి ఎల్లమ్మను దర్శించుకున్న అంభత్రేయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామిజి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి హారతులిచ్చారు. స్వామివారిని ఆలయ కమిటీ సభ్యులు పూల మాలతో సత్కరించి స్వామి వారిపై పువ్వులను చల్లుతూ ఘన స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం కోసం భక్తులు పోటీపడ్డారు. భక్తులతో ఆలయం అంతా కూడా కిటకిటాలాడిపోయింది. ఈ సందర్భంగా స్వామిజి మాట్లాడుతూ.. సూర్య గిరి ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమహగల్ల దేవతగా కొలుస్తారని తెలిపారు. అమ్మవారిని మనసుల్లో తలచి ఏ కార్యము చేసిన శుభం కలుగుతుందని అన్నారు. హిందూ సంస్కృతిని ప్రతి ఒక్కరు పాటించాలని,ఆలయాలను దర్శించిన పుణ్య ఫలం లభిస్తుందని, ఆధ్యాత్మిక చింతనలో మానవులంతా.. సమానులేనని భక్తులకు సూచనలిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరాగా వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
Rwad also : అన్న దమ్ముళ్ల… ఉన్న గ్రామాలను వేడదీయకండి : జన్నాయిగూడ గ్రామస్తులు
Read also : తలనొప్పి అని సెలవు అడిగితే.. మేనేజర్ షాకింగ్ రిప్లై?





