
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చేటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మమ్మల్ని వేలెత్తి చూపించే అధికారం లేదని విమర్శించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటూ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రజల వద్దనే ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చారు అని తెలిపారు. తుఫాన్ సమయంలో మేమేం చేశామో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఉంటే కదా అంటూ.. ఎక్కడో ఉన్న మీకు ఇక్కడ విషయాలు ఎలా తెలుస్తాయి లే అని జగన్ కు కౌంటర్ వేశారు. ఇక నేను ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ చూడడానికి చాలానే కారణాలు ఉన్నాయి. నాకు మహిళలు అంటే గౌరవం.. అందుకే నేరుగా ముంబై వెళ్లి మరి ఫైనల్ మ్యాచ్ చూసి వచ్చాను అని అన్నారు. ఇక తల్లి, చెల్లిని తరిమేసినటువంటి మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది అని కౌంటర్ వేశారు. కాగా నిన్న తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు, లోకేష్ పై పలు సెటైర్లు వేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఒక రోజు వచ్చి పరామర్శిస్తాడు… అతని కొడుకేమో ముంబై క్రికెట్ చూడటానికి పోతాడు.. అంటూ రైతులను దారుణమైన పరిస్థితిలో ఉంచి కూడా ఇలా ఎలా తిరుగుతారు అని.. ప్రశ్నించగా దానికి సమాధానం గా మంత్రి లోకేష్ నేడు వివరణ ఇస్తూ కౌంటర్లు వేశారు.
Read also : USA లో కుప్ప కూలిన కార్గో విమానం.. ఘోరంగా ఎగిసిపడ్డ మంటలు!
Read also : స్టార్ ప్లేయర్ ను రిలీజ్ చేయనున్న SRH జట్టు





