
క్రైమ్ మిర్రర్ న్యూస్, జాతీయ న్యూస్:-
తాజాగా మిహిర్ రాజేష్ అనే ముంబై కి చెందిన ఒక వ్యక్తి వేసిన కేసుకు గానూ సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిహిర్ రాజేష్ అనే వ్యక్తి .. పోలీసులు నన్ను అరెస్టు చేస్తున్న సందర్భంలో ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడగగా వాళ్ళు ఏ కారణాలు చెప్పలేదని.. అందుకే ఈ కేసును వేస్తున్నామని అతని తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. ఇక ఈ కేసును లోతుగా పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఎవరైనా సరే, ఏ తప్పు చేసినా సరే కారణాలు చెప్పకుండా అరెస్టు చేయకూడదని పోలీసులకు సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కారణాలు చెప్పకుండా అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది. అరెస్టు చేసేముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము?.. ఎఫ్ఐఆర్ లో ఏం రాశాం?.. ఏ చట్టాలను ప్రస్తావించారో.. ఇలాంటి విషయాలన్నిటిని కూడా నిందితులకు ముందే చెప్పాలి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అరెస్టుకు ముందు లేదా కొన్ని అనుకోని పరిస్థితులలో అరెస్ట్ అయిన తర్వాత నైనా సరే తక్షణమే కారణాలు చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాలి అని తెలిపారు. అలా చెప్పకుండా రెండు గంటల్లోపే మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగలిగితే ఇది వర్తించదు అని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను వెల్లడించింది. కాబట్టి ఇప్పటినుంచి ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ముందు అతనికి కచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న వివరణ అయితే ఇవ్వాలి అని పోలీసులకు తెలిపారు. అలా చేయని పక్షంలో పోలీసులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
Read also : హీరో విజయ్ తో గొడవలు.. ఖండించిన అజిత్!
Read also : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం!





