
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూ ఉంది. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో చెత్త పేరుకుపోయి ఉంది అని దానికి కారణం కేటీఆర్ కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి గల్లీలోకి వచ్చి చెత్త ఉంది అంటూ చెప్పుకొస్తున్న కేటీఆర్.. ఆ చెత్త నా కొడుకే కదా 10 ఏళ్ళు మునిసిపల్ మంత్రిగా ఉంది.. అప్పుడు దానికి కారణం కేటీఆర్ ఏ కదా?.. అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో చెత్త పెరగడానికి, డ్రైనేజీలు నిలవడానికి, ప్రజల రోగాల బారిన పడడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు కేవలం బెంజ్ కారులలోనే తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని.. ఇప్పుడు ఆ కారు పంచర్ అవడం వల్లే ఆటోల్లో తిరుగుతూ చెత్త పేరుకు పోయింది.. అని అంటున్నారు. అంటే ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు కేటీఆర్ ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని.. కాకపోతే మెజారిటీ ఎంతో తెలుసుకోవాల్సి ఉంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలలో ఓడిపోయిన వారికి అవమానం ఎదురయ్యేలా ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. ఓడిపోతే అవమానమే అని అన్నట్లుగా కూడా చాలామంది వ్యవహరిస్తున్నారు.
Read also : హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తున్నాడు.. ఇది బెదిరింపుల సర్కార్ : కేటీఆర్
Read also : త్వరలోనే ఫుట్ బాల్ కు వీడ్కోలు పలకనున్న రోనాల్డో?





