
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కోటప్పకొండకు చేరుకున్నారు. అయితే ఈ సమయంలోనే చాలామంది యువకులు పవన్ కళ్యాణ్ ను చూడడానికి భారీ స్థాయిలో తరలివచ్చారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ చుట్టూ పరిగెత్తుకుంటూ చేతులు ఊపుతూ కేరింతలు వేశారు. “సీఎం సీఎం”.. అంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ రావడంతో భారీ సంఖ్యలో అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఇక అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులతో పాటు వేద పండితులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించినటువంటి కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 5 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము అని ప్రకటించారు. ఇక తిరిగి పవన్ కళ్యాణ్ వెళ్తున్న క్రమంలోనూ భారీ సంఖ్యలో అభిమానులు అభివాదం చేశారు.
Read also : New Traffic Rule: ఐదు తప్పులు దాటితే లైసెన్స్ ఔట్, కేంద్రం కొత్త నిబంధనలు!
Read also : Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్, ప్రారంభించనున్న ప్రధాని మోడీ!





