శ్రీశ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ తల్లికి సాక పోసి పూజలు చేసిన గ్రామ సర్పంచ్

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సాకలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సాకలు పోసుకునే పర్వదినం మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గురువారం రోజుల్లో గ్రామాల్లోని మహిళలు ఉపవాసం ఉండి గ్రామ దేవతలకు తమతమ పంటపొలాల చుట్టూరా (మజ్జిగ,బెల్లం పానకం,కల్లుతో మరియు ఉళవలు,కందులు ఉడికించిన గుగ్గిళ్ళును సమర్పించి)సాకాలు సమర్పించి పంటలు బాగా పండాలని ప్రకృతిని దైవాన్ని ఆరాధింస్తారు. ఈ సాకల పర్వదిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ మరియు మహిళా భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read also : గ్రామీణ వైద్యుడికి తుది నివాళి.. అంత్యక్రియల్లో పాల్గొన్న మండల యూనియన్ సభ్యులు

Read also : సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button