Monday, February 23, 2026
Homeక్రైమ్ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు.. వరంగల్ జిల్లాలో కలకలం

ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు.. వరంగల్ జిల్లాలో కలకలం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులను నరికిచంపారు మావోయిస్టులు. ఈ ఘటన ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీస్ శాఖను కలవరపెట్టింది. ములుగు జిల్లాలోని వాజేడులో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు వ్యక్తులను హతమార్చారు.

వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గొడ్డళ్లతో నరికి చంపేశారు. మావోయిస్టులు నరికి చంపిన వారిలో ఒకరు.. పెనుగోలు గ్రామస్తుడు రమేష్. ఆయన ఇదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు. గతంలో హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లా, ఛత్తీస్ గడ్ సరిహద్దులో వరుస ఎన్ కౌంటర్లు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడటం సంచలనం కలిగించింది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments