
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు నాయకులు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. కొత్త జిల్లాలతో పాటుగా ఆ జిల్లాలలో ఉండేటువంటి మండలాల పైన కూడా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో కొన్ని నియోజకవర్గాలు పాత జిల్లాల్లోనే కలిసిపోనుండగా మరో కొన్ని జిల్లాలు కొత్త జిల్లాల్లో కలవనున్నాయి.
Read also : కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్‌లో చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన కీలక అడుగులు వేస్తుంది. ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా వాటిని 32 జిల్లాలకు చేసే విధంగా కసరత్తులు చేస్తుంది. కొత్తగా ఆరు జిల్లాలపై దాదాపు స్పష్టత వచ్చిందని చెప్పాలి.
కొత్తగా ప్రతిపాదించిన 6 జిల్లాలు
1. అమరావతి
2. పలాస
3. మార్కాపురం
4. గూడూరు
5. మదనపల్లి
6. రాజంపేట
పైన పేర్కొన్న ఈ 6 జిల్లాలు దాదాపు ఖరారు అయినట్లే అర్థమవుతుంది. ఇందులో ఒకటి లేదా రెండు స్థానాలలో మార్పులు లేదా చేర్పులు ఉండవచ్చని అధికారులు చెప్పుకొస్తున్నారు. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం అనేది ఇవ్వనుంది.
Read also : గోల్డ్ లవర్స్ గంతేసే న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!