Monday, February 16, 2026
Homeతెలంగాణగులాబీకి ముల్లుగా మారిన కవిత

గులాబీకి ముల్లుగా మారిన కవిత

  • బీఆర్ ఎస్ శ్రేణులో గంద‌ర‌గోళం
  • క‌విత చేల్చే ఓటు బీఆర్ ఎస్‌కు భారీ న‌ష్టం
  • త్వ‌ర‌లో పార్టీ ప్ర‌క‌టించ‌నున్న క‌విత‌

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ తెలంగాణ‌లో పూర్వ‌వైభవం కోసం పోరాడుతున్న నేప‌థ్యంలో ఆపార్టీకి చెందిన ఇంటి పోరే పార్టీకి శాపంగా మారింద‌ని ప‌లువ‌రు అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయడం గులాబీ బాటలో ముళ్ల కంచెగా మారుతోంది. పైకి బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నప్ప‌టికి క్షేత్రస్థాయిలో కవిత చీల్చే ప్రతి ఓటు పార్టీ పునాదులను కదిలిస్తుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ అస్తిత్వం కోసం అడుగులు వేయడం, గులాబీ దళానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత క‌విత చేసిన వ్యాఖ్య‌లు వ్యాఖ్య‌లు బీఆర్ ఎస్ పునాదుల‌ను క‌దిలిస్తున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు.మున్సిపల్ ఎన్నికల్లో కవిత తన మద్దతుదారుల ద్వారా ‘సింహం’ గుర్తుకు మద్దతు ఇచ్చి క్షేత్రస్థాయిలో తన బలాన్ని నిరూపించుకున్నారు.

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా వ్యూహంతో జరిగిన రాజకీయ దాడి అని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత చీల్చే ప్రతి ఓటూ నేరుగా బీఆర్ఎస్ ఖాతా నుంచే మైనస్ అవుతుండటం ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఆందోళనలో పడేసింది.కవిత తన విమర్శనాస్త్రాలను కేవలం ప్రత్యర్థి పార్టీల వైపు కాకుండా సొంత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావుల వైపు మళ్లించడం ఇక్కడ ఆసక్తి రేపుతోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గాలికి వదిలేశారంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

తండ్రి కేసీఆర్ పట్ల అపారమైన గౌరవం ప్రకటిస్తూనే, ప్రస్తుత పార్టీ నిర్వహణపై ఆమె నిప్పులు చెరుగుతున్నారు. దీనివల్ల పార్టీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కవిత వైపు చూసే అవకాశం ఏర్పడింది. బీఆర్ఎస్‌లో తలెత్తిన శూన్యతను తన వైపు తిప్పుకోవడంలో ఆమె సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం కవిత తన రాజకీయ ఎజెండాలో బీసీ సామాజిక వర్గాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.

“ఇది కేవలం టీజర్ మాత్రమే అసలు సినిమా ముందుంది” అంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్, రాబోయే రోజుల్లో పోరు మరింత ముదురుతుందని సంకేతాలిచ్చింది. తెలంగాణ జాగృతి నెట్‌వర్క్‌ను ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మార్చడం ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు ఆమె ద్ధమవుతున్నారు.తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉన్నాయి. సొంత గూటి నుంచే మొదలైన ఈ ‘సింహ’ గర్జనను గులాబీ దళం ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments