Tuesday, February 24, 2026
Homeతెలంగాణగీత చారీ పై చేసిన అసభ్య పదజాలంను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి : పల్లెటి...

గీత చారీ పై చేసిన అసభ్య పదజాలంను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి : పల్లెటి జగన్

క్రైమ్ మిర్రర్,మాడ్గుల:- తలకొండపల్లి మాజీ జేడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అమనగల్ మున్సిపాలిటీ ఎన్నికల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టను సారంగా నోటికి వచ్చిన భాషలో మాట్లాడంపై బీజేపీ రంగారెడ్డి జిల్లా ఎస్సి మోర్చా ఉప అధ్యక్షులు పల్లెటి జగన్ తీవ్రంగా ఖండించారు. గత మూడు రోజుల క్రితం అమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ గా పత్య నాయక్, వైస్ చైర్మన్గా తల్లోజీ గీత చారీ ప్రమాణ స్వీకారం చేశారు. మీడియా తో బీజేపీ నాయకులు తల్లోజీ ఆచారి మాట్లాడుతూ అమనగల్ అభివృద్ధి కోసం బీజేపీ కౌన్సిలర్ల మద్దత్తు కాంగ్రెస్ పార్టీ కి ఇస్తాం అని అన్నారు. ఈ వీడియో వైరల్ కావడం తో బిఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటేష్ అసభ్య పాదజాలంతో దూశిస్తూ తల్లోజీ గీత చారీ పై ఇష్టనుసారంగా మాట్లాడం పై బీజేపీ శ్రేణులు ఉప్పల వెంకటేష్ అక్రమ దందాల పై ద్వాజమెత్తరు.

గతం లో ఆచారి తో సహాయ సహకారాలు పొంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టె ఉప్పల వెంకటేష్ ని జీవిత చరిత్ర మొత్తం కల్వకుర్తి ప్రజలకు తెలుసు అని పల్లెటి జగన్ అన్నారు. తక్షణమే అమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తల్లోజీ గీత చారీ పై చేసిన వాక్యాలపై ఉప్పల వెంకటేష్ క్షమాపణ చెప్పక పోతే రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ ఇంటిని ముట్టడిస్తాం అని పిలుపు నిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ని ఏ ఊరులోనైనా తిరగనివ్వము అని హెచ్చరించారు. మతి స్థిమిత్తం తప్పిన ఉప్పల వెంకటేష్ ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ లతో చూయించుకోకపోతే బీజేపీ ట్రీట్ మెంట్ ఎట్లుంటాదో చూపిస్తాం అని హేచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎరుకలి కాటం గౌడ్, మెట్టు శ్రీను, ఆదిమల్ల గిరి ఈర్ల పల్లి మధు, చాట్ల శివ తదితరులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments