
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లా ముందుకు తీసుకెళుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది నా బాధ్యత అంటూ ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లా మంత్రులతో పాటుగా, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మరియు మహిళలు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. ప్రతిరోజు కూడా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక బుల్లెట్ స్పీడ్ వేగంతో దీనిని ముందుకు తీసుకు వెళ్తున్నారు అని వైసీపీ పార్టీ సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ పార్టీ కోసం ఎంతకైనా వెనుకాడబోమని కార్యకర్తలు నిరూపిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రైవేటీకరణతో ప్రజలకు అలాగే విద్యార్థులకు కలిగే నష్టాలను వివరిస్తూ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. దీనికి తోడు ప్రజలు కూడా ప్రైవేటీకరణతో నష్టమే అంటూ సంతకాలు కూడా చేస్తున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రైవేటీకరణను ఆపి విజయవంతం చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Read also : తొక్కిసలాట బాధితులను కలిసిన విజయ్!
Read also : సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్





