
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- మునుగోడు నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చేంతవరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కి చెందిన శంకరా కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపురూపమైన స్పందన వస్తోంది.ఇప్పటివరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా.ఈరోజు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు… ఆపరేషన్లకు ఎంపికైన వారిలో 110 మంది పేషెంట్లను ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి..
నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి తన భర్త గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తో కలిసి పరిశీలించారు… కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు విడతల ఉచిత కంటి వైద్య శిబిరాలలో 1781 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించారు.