అంతర్జాతీయం

ట్రంప్, పుతిన్ 3 గంటల సమావేశం, చివరికి ఏం తేలకుండానే…

Trump-Putin Meeting: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలాస్కా వేదికగా సమావేశం అయ్యారు.  మూడు గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. సమావేశం అనంతరం ఇద్దరూ కీలక విషయాలను వెల్లడించారు.

శాంతి చర్చల్లో పురోగతి- ట్రంప్

ఫుతిన్ తో సమావేశం ఫలప్రదమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని,  కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ ను కలుస్తానని చెప్పారు.

యుద్ధం ముగింపుకు సిద్ధం- ఫుతిన్

అటు  అలస్కా సమావేశం చాలా బాగా జరిగిందన్నారు ఫుతిన్. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ నకు ఫుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌ తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్‌ వెల్లడించారు. ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదన్నారు. ట్రంప్ తో నెక్ట్స్ సమావేశం మాస్కోలో ఉంటుందని పుతిన్ తెలిపారు.

Read Also: సీఎం యోగిపై ప్రశంసలు, మహిళా ఎమ్మెల్యేపై ఎస్పీ సస్పెన్షన్!

Back to top button