క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) ఈ రోజు (డిసెంబర్ 8, 2025) హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. ఈ సమ్మిట్ డిసెంబర్ 9 వరకు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా సమ్మిట్‌ను ప్రారంబిస్తారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం మరియు 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే Telangana Rising 2047 Vision Documentను ప్రపంచానికి తెలియజేయడం. 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు, ప్రపంచ బ్యాంక్, WHO, UNICEF వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతి నిధులు మరియు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో ఇంధనం, ఐటీ, సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి 27 కీలక రంగాలపై నిపుణులతో ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభోపన్యాసం చేస్తారు.
డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో ప్రత్యేక పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అయితే, డిసెంబర్ 10 నుండి 13 వరకు సమ్మిట్ ప్రాంగణాన్ని ప్రజలు ఉచితంగా సందర్శించడానికి అనుమతి ఉంది.





