
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- 104 ఉద్యోగుల 9 నెలల వేతనాలు మరియు రీడిప్లయ్మేంట్ క్రింద ఫార్మసిస్టు మరియు ల్యాబ్ టెక్నీషియలను సొంత జిల్లాలలో సర్దుబాటు చేయాలని,104 ఉద్యోగులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను మగ్దూం భవన్ లో కలిసి అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.104 ఉద్యోగులు మాట్లాడుతూ.. 104 ఉద్యోగులు గత 18 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్నామని,మాకు గత సంవత్సరం 2025 నుండి ఇప్పటివరకు అనగా తొమ్మిది నెలలు వేతనాలు లేక,వేతనాలు రాకపోవడం వలన కుటుంబ పోషణ భారమై చావే శరణ్యమయింది అన్నారు. ఫార్మసిస్టు మరియు ల్యాబ్ టెక్నీషియలను రీడిప్లయ్మెంట్ ద్వారా సర్దుబాటు జోనల్ వైజ్ గా కాకుండా సొంత జిల్లాలలో సర్దుబాటు చేయడం,తక్కువ వేతనాలు కాబట్టి మా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.చిన్న జీతానికి జిల్లాలు దాటిపోవడం వలన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని.ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి కోరారు..బి యాదగిరి, వి సురేష్ కుమార్, పి శ్రవణ్ కుమార్,సతీష్ కుమార్,మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
Read also : మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన “జి రామ్ జి” చట్టంను రద్దుచేయాలి
Read also : ఉదయాన్నే దీనిని తాగితే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది!





