
ఎమ్మెల్యే కూన రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు నా కాలి కింద చెప్పు విలువ కూడా చేయరని అన్నారు. అయినా.. వారు చేసిన ఆరోపణలను ఎదుర్కొంటానన్నారు. ఇంతకీ ఎవరు వారు..? ప్రత్యర్థులా…? ఆయనపై విమర్శలు చేస్తున్న ప్రిన్సిపల్ సౌమ్యనా..? ఎవరిని చెప్పుతో పోల్చారు కూన రవికుమార్. అంత ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది…?
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేజీబీవీ (KGBV) పన్సిపల్ సౌమ్య మధ్య పంచాయతీ నడుస్తోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ఆత్మహత్యాయత్నం కూడా చేశారు సౌమన్య. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఆయన ఎమ్మెల్యేకు చివాట్లు వేసినట్టున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకోనని హెచ్చరించినట్టు కూడా సమాచారం. దీంతో.. ప్రిన్సిపల్ సౌమ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కూనరవికుమార్. తనపై ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమె సావిత్రిని మంచి నటిస్తోందని సెటైర్ వేశారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రత్యార్థులు చేస్తున్న కుట్రలో పాలుపంచుకున్నారని విమర్శించారు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నానని పెద్ద పెద్ద ఆరోపణలు చేసిన ఆమె.. దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శారీరక వేధింపులు అంటే… అర్థమేంటని నిలదీశారు…? ఆమెను తాను ఎప్పుడు, ఎక్కడ కలిశానో చెప్పాలన్నారు.
ప్రిన్సిపల్ సౌమ్య గురించి తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. విద్యార్థులు, తల్లిదండ్రులు నాకు కంప్లెయింట్ చేశారన్నారు. ఆమెను పిలిచి మాట్లాడానన్నారు. కానీ.. ఆమెను తన ఆఫీసులో.. తనపైనే అరిచి… తననే బెదిరించిందన్నారు. ఆమె సోదరుడు ఒక రౌడీషీటరని, పోక్సో కేసు కూడా ఉందని… అతనికి చెప్పి.. తన అంతుతేలుస్తానంటూ… బెదిరించిందన్నారు. ఆమెపై వేసిన విచారణలో ఆరోపణలు నిజమని తేలిన తర్వాతే… ఆమెను ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగిందన్నారు. ఒక శాసనసభ్యుడిగా అది తన విధి అన్నారు కూడా రవికుమార్. ఇందులో తాను చేసిన తప్పేంటో చెప్పాలన్నారు.
తన క్యారెక్టర్‌పై బురదచల్లితో చూస్తూ ఊరుకోనని అన్నారు. ఆమెకు మాత్రమే క్యారెక్టర్ ఉందా..? నాకు లేదా అంటూ ప్రశ్నించారు. ఇందులో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ పాత్ర ఉండోచ్చన్నారు కూన. తన కాలికి ఉన్న చెప్పు విలువ కూడా చేయని వారు.. తనపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తేలిగ్గా వదిలేదిలేదని హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే… పరువు నష్టం దావా కూడా వేస్తానన్నారు ఎమ్మెల్యే. నిజంగా…. ఈ ఇష్యూలో ఎమ్మెల్యే తప్పు లేదా…? వైసీపీ నేతలు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారా…? సౌమ్య ఆరోపణల్లో నిజమెంత…? ఎమ్మెల్యే నిజాయితీ ఎంత…? ఈ విషయం… ఎంత దూరం వెళ్తుందో చూడాలి.