
-
-
సంక్రాతి సందర్బంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విందు భోజనం
-
-
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
క్రైమ్ మిర్రర్,పెద్దవూర ప్రతినిధి: నల్గొండ జిల్లా పెద్దగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి సంబరాల నేపథ్యంలో గ్రామ పరిధిలో ఉన్న 3ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి విందు భోజనం అందించి పలువురిని ఆకట్టుకున్నారు.

పాఠశాలల హలో బేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తనమందు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సర్పంచ్ రమణమ్మ కోటిరెడ్డి లను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు పూట విద్యార్థులకు విందు భోజనం అందించడం మంచి పరిణామం అని అలాగే నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం సర్పంచ్ కష్టపడి పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పెద్దగూడెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు





