క్రైమ్

సిరాజ్‌ ఉగ్ర లింకులపై దర్యాప్తు వేగం

హైదరాబాద్‌, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌ నగరంలో అనుమానాస్పదంగా మకాం వేసిన సిరాజ్‌ అనే వ్యక్తి ఉగ్రవాద అనుబంధాలపై విచారణ కొనసాగుతోంది. గత ఏడు సంవత్సరాలుగా సిరాజ్‌ నగరంలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్‌ తన సహచరుడు సమీర్‌తో కలిసి ఐదు ప్రముఖ నగరాల్లో రెక్కీ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ నగరాల్లో హైదరాబాద్‌, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలు ఉన్నాయి.

ఇక వరంగల్‌కు చెందిన ఫర్హాన్‌ మోయినుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బాదర్‌ అనే వ్యక్తితో సిరాజ్‌ సిగ్నల్‌ యాప్‌ ద్వారా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన శంకలను మరింత బలపరుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే మదుపులు, టెక్నికల్‌ ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నాయి.

Back to top button