తెలంగాణ

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • సభ ముందుకు కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌

  • బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వనున్న సర్కార్‌

  • అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న అధికార, విపక్షాలు

  • అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వంలో సభలో ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం ఎత్తిచూపే అవకాశం ఉంది. అదే సమయంలో కమిషన్‌ ఇచ్చిన పూర్తి నివేదికను సభలో పెట్టాలని విపక్ష బీఆర్ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సభలో రేవంత్ సర్కార్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. సభ ప్రారంభానికి ముందు జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Read Also:

  1. 15 కి. మీ మేరా ట్రాఫిక్ జామ్.. NH-44 పై నిలిచిపోయిన భారీ వాహనాలు!
  2. జపాన్ కు చేరిన ప్రధాని మోడీ, టోక్యోలో ఘన స్వాగతం
Back to top button