
క్రైమ్ మిర్రర్, మద్దూర్ : మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగాల్ చెడు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను కొత్తపల్లి శివారులో ఆపి తనిఖీ చేయగా టిప్పర్ డ్రైవర్ ఎండి షరీఫ్ ఆపకుండా ముందుకు వెళ్ళి టిప్పర్ను రోడ్డు ప్రక్కల దించి ఇసుకను అన్లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొనగా టిప్పర్ ఓనర్ యం.డి మహబూబ్ బాషా, కొడుకు ఖాదర్ లు వెంటనే వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులను ముగ్గురు బూతు మాటలు తిడుతూ దాడి చేయగా టాస్క్ఫోర్స్ పోలీసులు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా టిప్పర్ ను వారి ముగ్గురిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విధి నిర్వహణ ఉన్న పోలీస్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి మరియు దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.