
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా ప్రకటిస్తూ తదుపరి ఎన్నికల్లో తెలంగాణకు నేను స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడిస్తాను. ఈ సారి ఆయనను కాపాడటానికి రాహుల్ గాంధీ గానీ, ప్రధాని నరేంద్ర మోదీ గానీ ఎవరూ కాపాడలేరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యల్లో ఆయన ఇంకా ముందుకు వెళ్ళుతూ, రేవంత్ రెడ్డి బిహార్ ప్రజల DNA గురించి చేసిన మాటలు మాకు అవమానకరంగా ఉన్నాయి. బిహార్ ప్రజల DNA తక్కువ అయితే, మూడు సార్లు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్నెందుకు అడిగాడు? ఆయన అని ప్రశ్నించారు. ఇక మరోవైపు, రేవంత్ రెడ్డి ఎంతో కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మళ్లీ రెండోసారి గెలవడం చాలా కష్టమే. ఆయనను ప్రజలు తిరస్కరిస్తారు అని కూడా కిషోర్ స్పష్టం చేశారు.
Read also : తొలి రోజే ఊహించని కలెక్షన్లు…!
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉద్వేగం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారవచ్చని, ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా వినియోగించుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బిహార్ రాష్ట్రంపై ఉన్న అభిప్రాయ భేదాలను మళ్లీ బహిర్గతం చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ప్రకటన తెలంగాణలో రాజకీయ వేడి పెంచింది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధినేతల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read also : మరో నాలుగు రోజులు వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!