
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్లో నివసించే బచ్చు సుదర్శన్ (75) అనే వృద్ధుడు ఆదివారం ఇంటి వరండాలోని కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య 20 సంవత్సరాల క్రితమే మృతి చెందగా, కుమారులు హైదరాబాద్లో నివసిస్తుండటంతో వృద్ధుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు బచ్చు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేష్ తెలిపారు.
Read also : Electric Bike Fire: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు
Read also : SBIలో 1146 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?





