తెలంగాణ

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన “జి రామ్ జి” చట్టంను రద్దుచేయాలి

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిప్ భారత్ జి రామ్ జి – 2025 /197 చట్టమును వెంటనే రద్దుచేసి, 2005 – మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి, 2005 – మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే విధంగా గ్రామపంచాయతీలో తీర్మానం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్ల గ్రామ పంచాయతీ సర్పంచు గడ్డం ముత్తమ్మ,పంచాయతీ కార్యదర్శి విగ్నేష్లకు కూలీలతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా గ్రామీణ పేదలకు వ్యవసాయ కూలీల ఉపాధి కోసం 2005లో నాటి యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వందరోజుల పని గ్యారంటి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు.చట్టం వల్ల గ్రామీణ ప్రాంతంలో కూలీలకు సన్న చిన్న కారు రైతాంగానికి ఉపాధి దొరికి గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులలో మార్పులు వచ్చాయని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా 100 రోజుల పని ప్రజల కడుపులు నింపిందని అన్నారు.

Read also : నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో సన్మానం

ప్రధానంగా పొట్ట చేత పట్టుకొని పని కోసం వలసలు పోయే దళితులు,గిరిజనులు, వెనకబడ్డ తరగతులకు సంబంధించిన ప్రజలకు అండగా ఉండి వలసలను కూడా నివారించిందని తెలిపారు. గ్రామీణ పేదలకు ఆర్థికంగా ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చడానికి అధికారం చేపట్టిన నాటినుండి మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలు చేసిందని విమర్శించారు. ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను ఉపాధి పనికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శించారు. ఇప్పుడేమో మహాత్మా గాంధీ పేరును మార్చి చట్టంలో ఉన్న హక్కులన్నింటినీ తొలగించి మత కోణం నుండి జి రామ్ జి చట్టం తెచ్చి ఉపాధి కార్మికుల హక్కులను మొత్తం కాలరాసిందని విమర్శించారు. 90 శాతం బాధ్యత వహించవలసిన కేంద్ర ప్రభుత్వం కేవలం 60 శాతం కే పరిమితమై రాష్ట్రాల మీద పథకాన్ని వదిలేయడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు.125 రోజుల పేరుతో 60 రోజులు పని బందు పెట్టడం ఎమిటని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి,పాత చట్టాన్ని కొనసాగించాలని, 200 రోజుల పని దినాలకు పెంచి రోజు కూలి 800 వందల రూపాయలు ఇవ్వాలని నర్సింహ డిమాండ్ చేసినారు.ఇంకా ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు వేముల బిక్షం, గ్రామ ఉపసర్పంచ్ అనుమంతుల రమేష్,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తుమ్మలగూడెం యాదగిరి, నాయకులు, వ్యవసాయ కూలీలు భాషబోయిన రాములు, బుగ్గయ్య,మరిపల్లి మల్లయ్య, బండ బీరయ్య,కే.అంజయ్య, సత్యనారాయణ, శ్రీను, ఉప్పలయ్య ,వెంకటయ్య, యాదయ్య ,లింగయ్య , సర్వయ్య,ఎల్లయ్య,యాదమ్మ, రాజమ్మ,పద్మ,అండాలు,కలమ్మ, మల్లమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button