
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:-బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ 2020లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ సోదరి అయినటువంటి శ్వేతా సింగ్ తన అన్న మరణం గురించి సంచలన ఆరోపణలు చేసింది. మా అన్నయ్య ది ఆత్మహత్య కాదు అని.. ఇద్దరూ వ్యక్తులు కలిసి హత్య చేశారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ఈ విషయాన్ని యూఎస్ మరియు ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేరువేరుగా నా వద్దకు తనకు చెప్పారు అని ఆమె తెలిపారు. సుశాంత్ సింగ్ బెడ్ మరియు ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను కచ్చితంగా ఉరేసుకుని అయితే చనిపోయే అవకాశం అసలు లేదు అని ఆమె వెల్లడించారు. మెడ పై దుప్పటి మార్కులు కాకుండా ఒక చిన్న చైన్ ముద్ర మాత్రమే కనిపించింది అని ఆమె కీలక విషయాలను చెప్పుకొచ్చారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా అంతట క్షణాల్లోనే వైరల్ అవుతుంది.
Read also : చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం
2020లో ఈ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆమె సోదరీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియట్లేదు. కాగా ఈ విషయం మళ్ళీ సోషల్ మీడియా అంతటా వైరల్ కావడంతో సుశాంత్ సింగ్ మరణం పై మళ్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలి అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అప్పట్లో సుశాంత్ సింగ్ మరణ వార్తను దేశవ్యాప్తంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. కొన్ని లక్షల మంది అభిమానులు సుశాంత్ సింగ్ మరణం పై ఆందోళనలు వ్యక్తం చేశారు. నేడు సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మళ్ళీ ఈ విషయం చర్చనీయంశంగా మారింది.
Read also : రన్ ఫర్ యూనిటీ… ఐక్యమత్యమే మహాబలం
 
				 
					
 
						 
						




