క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: కుటుంబంతో కలిసి ట్యాంక్ బండ్ చూడడానికి వెళ్తున్న వారిని ఆర్టీసీ (TGSRTC) బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. వారిని బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.బస్సు వెనుక టైర్లు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు మరియు వెంకటమ్మ దంపతులు. వీరు కొత్తపేటలోని తమ కుమార్తె ఇంటికి వచ్చి, కుటుంబంతో కలిసి ట్యాంక్ బండ్‌కు వెళ్తుండగా హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ (మలక్‌పేట్) వద్ద 2026, జనవరి 1 (గురువారం) రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు దుర్మరణం పాలయ్యారు.
వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ముసారాంబాగ్ సమీపంలో దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ (TGSRTC) బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు కింద పడిపోగా, బస్సు వెనుక టైర్లు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మలక్‌పేట్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా/గాంధీ ఆసుపత్రికి తరలించారు.





